గొప్ప ఆనందమును గూర్చిన శుభవార్త

జాన్‌పైపర్‌ గారి ద్వారా వ్రాయబడిన ఆగమనం గూర్చి 25 ఆధ్యాత్మిక ధ్యానములు

క్రిస్మస్‌ విషయంలో దేవుడు ఏమి కోరుచున్నాడు?

ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు వారి రక్షకుని విషయంలో ఉత్సవాలు చేసుకొనుచుండగా, ఆనందంతో ధ్యానించడం మరియు ఆతురతతో ఎదురుచూచుటకు గుర్తుగా లేక చిహ్నముగా ఈ క్రిస్మస్‌ ఉంటుంది. గొప్ప ఆనందం గూర్చిన శుభవార్త అనే పుస్తకంలో జాన్‌ పైపర్‌ గారు శ్రోతలను ఆగమనం సమయంలో వారి హృదయాలను మరియొకసారి యేసు వైపు దృష్టించాలని ఆహ్వానిస్తున్నాడు.

గొప్ప ఆనందమును గూర్చిన శుభవార్త అనే పుస్తకం క్రిస్మస్‌ యొక్క మహిమకరమైన విషయాన్ని ఒక క్రొత్తదనంగా కనుగొనుటకు దోహదపడుతుంది. మన రక్షకుడైన యేసయ్య గూర్చి (ప్రతిరోజు) ఆలోచించుట, ఆయనలో విశ్రాంతి తీసుకొనుట, ఆనందించుట మరియు ఉజ్జీవింపబడుట అనేది బిజిగా ఉన్న ప్రజలకు ఎంత గొప్ప ఉపశమనం! (రే అర్ట్‌లండ్‌)

యేసుక్రీస్తు గూర్చిన ప్రాముఖ్యమైన నిధి

ఈ 25 ధ్యానములలో వున్న ప్రతి దినం ఒక వాక్యభాగము మరియు దాని గూర్చి క్లుప్తమైన వివరణ ఉంటుంది. వ్యక్తిగతంగా చదువుటకు మరియు కుటుంబ ధ్యానములకు అనువైనది. క్రీస్తు జననం వలన రక్షణ విషయంలో ఇవ్వబడిన మహోత్తరమైన వాగ్ధానాలను ధ్యానించుటకు ఈ అనుదినధ్యానాలు ఉపయోగపడును.

క్రిస్మస్ ఆనందాన్ని పంచుకోండి

© 2021 For the Truth